
భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నిర్వహించే నౌకాదళ దినోత్సవం-నేవీ డేని ఈ రోజు విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు. మిచాంగ్ తుపాను కారణంగా ఈ నెల 4న∙జరగాల్సిన వేడుకల ను 10కి వాయిదా వేశారు.నౌకాదళ దినోత్సవానికి ఈ ఏడాది ముఖ్య అతిథిగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం విశాఖ విమానాశ్రయం చేరుకుని సాయంత్రం 4.15 గంటలకు నేవీ విన్యాసాలకు హాజరవుతారని రాజభవన్ అధికారులు తెలిపారు.
అనంతరం తూర్పు నౌకాదళ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఆధ్వర్యంలో నేవీ హౌస్‌లో ‘ఎట్ హోం’ పేరిట నిర్వహించే తేనీటి విందుకు హాజరవుతారని తెలిపారు. కాగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్‌కే బీచ్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ ప్రదర్శనలు ప్రారంభమవుతాయని నేవీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్స్, హెలికాప్టర్లతో సిబ్బంది విన్యాసాలను ప్రదర్శిస్తారని తూర్పు నౌకాదళ అధికారులు తెలిపారు.





