News

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు

238views

రాష్ట్రంలో సందర్బం వచ్చిన ప్రతిసారీ సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. హిందువుల విశ్వసాలను కించపరచడమే ధేయ్యంగా ఈ వ్యాఖ్యలు సాగుతున్నాయి.

తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమందేపల్లిలోని స్నేహలతానగర్‌ చర్చిలో శనివారం ఐక్య క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్‌నారాయణ మాట్లాడుతూ ‘దేవుడిని కొలిచేవారు మేము, మా కుటుంబం, మా తమ్ముళ్లు బాగుండాలని కోరుకుంటారని హిందువులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే క్రిస్టియన్లయితే సంఘం, సమాజం బాగుండాలని ప్రార్థిస్తారు’ అని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే మాట్లాడారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివమాల ధరించిన ఎమ్మెల్యే.. ఇలా మాట్లాడడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.