News

ఓ ఆఫీసర్ గారూ ఇదేం పని, ప్రభుత్వ కార్యక్రమంలో ‘ప్రభువు’ స్తుతి

214views

ఇప్పటికే రాష్ట్రంలో అన్యమత ప్రచారం, మత మార్పిడులు నిరాటంకంగా జరుగుతున్నాయి. సాక్షాతూ రాష్ట్ర మంత్రే క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగంగా ప్రకటిస్తాడు. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అన్న చందనా రాష్ట్రంలో మరో సంఘటన జరిగింది. ప్రభుత్వ కార్యక్రమంలో ఓ ప్రభుత్వాధికారి నిర్వాకంతో అందరూ ఓ ఆఫీసర్ గారూ ఇదేం పని అనుకుంటున్నారు.కలెక్టరేట్‌లోని వేదికను ఓ మహిళా అధికారి క్రైస్తవ మత ప్రచారానికి వాడుకోవడం వివాదాస్పదమైంది.

గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ‘ఉన్నతి-మహిళా శక్తి’ పథకాన్ని జాయింట్‌ కలెక్టరు కేతన్‌గార్గ్‌, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి ప్రారంభించారు. జిల్లాకు మంజూరైన 13 ఆటోలను మహిళలకు పంపిణీ చేశారు. ముఖ్య అధికారులు వెళ్లిపోయాక మంజుల అనే డీఆర్‌డీఏ అధికారి వేదిక మీద లబ్ధిదారులకు బైబిల్‌ పుస్తకాలు పంచారు. కొందరు వాటిని తీసుకోగా.. వారితో కలిసి ఆమె ఫొటోలు తీయించుకున్నారు. దీనిపై పీడీ నరసింహారెడ్డిని వివరణ కోరగా.. తాము ఏ మత ప్రచార కార్యక్రమాలూ చేపట్టలేదని, సమావేశం అనంతరం ఎవరైనా ఆ వేదికను వాడుకొని ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత గ్రంథాన్ని పంచిన అధికారి మంజులను వివరణ అడగ్గా.. ఎవరో చర్చికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇచ్చారని, తనకు సంబంధం లేదని తెలిపారు.