
215views
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని బుధవారం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. గర్బాను.. మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో యునెస్కో చేర్చినట్లు ప్రకటించారు. ఇది గుజరాత్ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. గర్బా నృత్యం యునెస్కో జాబితాలో చేరడంపై ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. భారత సంస్కృతిని ప్రపంచానికి చూపేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. మన వారసత్వాన్ని భవిష్యత్తు తరాల కోసం సంరక్షించడానికి ఈ గౌరవం స్ఫూర్తినిస్తుందని చెప్పారు.





