News

శ్రీకాళహస్తిలో ఏడుగంగల సంబరం

272views

పంచభూత క్షేత్రమైన శ్రీకాళహస్తిలో నిర్వహించే ఏడుగంగల జాతర వైభవం ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలోని ఏడు ప్రాంతాల్లో ఏడుగురు గంగమ్మలను కొలువుదీర్చి జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. జాతరను పురస్కరించుకుని మంగళవారం ముక్కంటి ఆలయం తరఫున సారె సమర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గంగమ్మలకు సమర్పించే సారెను ముక్కంటి ఆలయంలోని అలంకార మండపం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దంపతులతో పాటు ఆలయ ఛైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో కె.ఎస్‌.రామారావులు సారెను శిరస్సుపై ఉంచుకుని భక్తి శ్రద్ధలతో ముత్యాలమ్మ, ఏడుగంగల ఆలయంలోని అమ్మవార్లకు సమర్పించారు.