
232views
తిరుపతిలో గత రెండు రోజులుగా మిగ్ జాం తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా కపిలతీర్థంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పుష్కరిణి నీటిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల అనుమతిని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది.





