
వేదాల్లో చెప్పే ఏ మంత్రంలో అయినా చివర్లో ఓం శాంతి … శాంతి … శాంతిః అని మూడుసార్లు చెబుతారు. ఎందుకలా చెబుతారు, ఆ 3శాంతులు వెనుకున్న ఆంతర్యం ఏంటి అనేది ఈ కధనంలో తెలుసుకుందాం.

మొదటి ” శాంతి “
ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు కలగకుండా మానవాళిని రక్షించమని అర్థం. దీన్ని ఆధ్యాత్మిక శాంతి అంటారు.
రెండవ ” శాంతి “
మనం, మన చుట్టూ ఉన్నవారు, పరిసరాలు, అంతా బావుండాలని, శారీరక , మానసిక పరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచి ఉపశమనం పొందడానికి, అందరిపైనా దేవుడి అనుగ్రహం, ఆశీస్సులు ఉండాలని ప్రార్థించేదే ఆదీ దైవిక శాంతి అంటారు.
మూడవ ” శాంతి “
ఇతర జీవరాశుల నుంచి , మనుషుల నుంచి ఏ విధమైన ఆపదలు, ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండేందుకు మూడో శాంతి మంత్రం పఠిస్తారు. దీన్ని ఆది భౌతికము అంటారు.
ఈ మూడు ఉపద్రవాలనుంచీ రక్షించమని వేడుకుంటూ వేదం చివర్లో ” శాంతి ” పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు.





