News

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌పై ఎన్‌ఐఏ కేసు

242views

ఎయిర్‌ ఇండియా ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉందంటూ బెదిరింపులకు పాల్పడిన ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై జాతీయ దర్యాప్తు సంస్థ -ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. అలాగే అతనికి చెందిన నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థపైనా కేసు పెట్టింది. పన్నూ వీడియో బెదిరింపులను తీవ్రంగా పరిగణించి ఐపీసీలోని సెక్షన్లతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదు చేసినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దంటూ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ ఈ నెల 4న ఓ వీడియోను విడుదల చేశాడు.