
285views
కార్యాలయంలో ఉన్న దుష్టశక్తులను తొలగించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులతో క్రైస్తవ మత ప్రార్థనలు చేయించాడో ఉన్నతాధికారి. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ చిన్నారుల సంరక్షణ కార్యాలయంలో జరిగింది. టీవీ ఛానెళ్లలో వచ్చిన వార్తల ఆధారంగా దీనిపై దర్యాప్తు చేయాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించినట్లు కలెక్టర్ కృష్ణతేజ తెలిపారు. గత నెలలో కార్యాలయంలోని ఉద్యోగులందరినీ అత్యవసర సమావేశం కావాలని ఆదేశించిన ఓ ఉన్నత అధికారి.. బైబిల్ చేతిలో పట్టుకుని ప్రార్థన చేపట్టారు. కార్యాలయంలో దుష్టశక్తులు ఉన్నాయని.. వాటిని తొలగించాలని ప్రార్థనలు చేయాలని ఉద్యోగులకు సూచించాడు. అంతా ఒప్పంద ఉద్యోగులు కావడం వల్ల ఎవరూ నోరు మెదపలేదు. ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి రావడంతో దర్యాప్తునకు ఆదేశించారు.