
ప్రపంచ హిందూ మహాసభలు-డబ్ల్యూహెచ్‌సీ నవంబర్ 24 నుంచి 26 వరకు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతాయని ఆ సంస్థ వ్యవస్థాపకులు స్వామి విజ్ఞానానంద్ తెలిపారు.
హిందూ సమాజం అందరికీ న్యాయం మరియు సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి ఒక సమగ్ర వేదికను అందించడంతో పాటు.. సనాతన ధర్మ విలువల కోసం పనిచేసే హిందూ పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు, విద్యావేత్తలు మరియు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులను ఒకచోట చేర్చడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు.
జయస్య ఆయత్నం ధర్మః , అంటే “ధర్మం, విజయానికి నిలయం” అనే ఇతివృత్తంతో 2023 ప్రపంచ హిందూ మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.వ్యాపారం, ఆర్థికం, విద్య, మీడియా, రాజకీయ, మహిళలు, యువత, దేవాలయాలలలో భావసారూప్యత కలిగిన వ్యక్తులను ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయడానికి మూడు రోజుల ప్రపంచ హిందూ మహాసభలు వేదికగా నిలుస్తాయన్నారు.
ఈ సదస్సు కోసం ఆసక్తి గల వ్యక్తులు www.worldhinducongress.org వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.




