News

గోవాలో జరుగుతున్న 37వ జాతీయ క్రీడలు

62views

గోవాలో జరుగుతున్న 37వ జాతీయ క్రీడల్లో,పురుషుల 100 యుపి బిలియర్డ్స్ స్వర్ణ పతకాన్ని కర్ణాటక గెలుచుకుంది, మహిళల 15 రెడ్ స్నూకర్‌లో బంగారు పతకాన్ని మధ్యప్రదేశ్ గెలుచుకుంది. మహిళల టేబుల్ టెన్నిస్‌లో మహారాష్ట్ర బంగారు పతకం, హర్యానా రజతం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లు సంయుక్తంగా కాంస్య పతకాలను గెలుచుకున్నాయి. పురుషుల టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణం ఢిల్లీ, రజతం పశ్చిమ బెంగాల్, కాంస్య పతకాలను మహారాష్ట్ర, అస్సాంలు కైవసం చేసుకున్నాయి. జాతీయ క్రీడల్లో మహిళల 4×100 మీటర్ల రిలేలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారిణులు చెలిమి ప్రత్యూష, మధు కావ్యారెడ్డి బంగారు పతకాన్ని సాధించారు. జాతీయ క్రీడల్లో 123 పతకాలతో మహారాష్ట్ర పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 54 పతకాలతో డిఫెండింగ్ ఛాంపియన్ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు రెండో స్థానంలో ఉండగా, హర్యానా 52 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది.