News

ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు.. ప్రధాని మోదీ రాసిన గార్బా వైరల్!

337views

నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ తొమ్మిది రోజులు దేశం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. ఉత్తరాదిలో నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ రాసిన గార్బా పాట యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. నవరాత్రి ఉత్సవాల కోసం తాను పాట రాశానంటూ స్వయంగా ప్రధాని ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ వీడియోను షేర్ చేశారు. దివ్యకుమార్ పాడిన ఈ పాటను అత్యద్భుతంగా చిత్రీకరించారు.