News

హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్న రష్యా పౌరులు

350views

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని అఖండ్‌ పరమానంద్‌ ఆశ్రమంలో రష్యాకు చెందిన మూడు జంటలు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాయి. 50 మంది రష్యా పౌరులు ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హరిద్వార్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో నచ్చాయని.. దీంతో మూడు జంటలు ఇక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. ఈ పెళ్లిలో వధూవరులు భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. వరులు షేర్వాణీ ధరించగా.. వధువులు లెహంగాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక పెళ్లి జంటలతో రష్యా పౌరులు.. ఉత్తరాఖండ్‌ సంప్రదాయ వాద్యాలను మోగిస్తూ సందడి చేశారు. తర్వాత ఆశ్రమంలో ఉన్న శివాలయాన్ని సందర్శించారు. అనంతరం పూలదండలు మార్చుకొని.. వేదమంత్రాల మధ్య మండపంలో ఏడు అడుగులు వేశారు.