News

భారత్ లో కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలి : విదేశాంగ మంత్రిత్వ శాఖ

294views

భారత్ – కెనడాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతల నేపధ్యంలో దేశంలో పెద్ద సంఖ్యలో కెనడా దౌత్యవేత్తలు ఉండటం, అంతర్గత వ్యవహారాల్లో వారి నిరంతర జోక్యం దృష్ట్యా, దేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని.. రెండు దేశాలకు సమాన సంఖ్యలో దౌత్యవేత్తలు ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరిందమ్ బాగ్చీ తెలిపారు. దేశంలో కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని భారత్ మరోసారి పునరుద్ఘాటించింది.