
Gaganyaan Mission
333views
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయని.. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్ ఎస్.ఉన్నికృష్ణన్ తెలిపారు.ఇందులో భాగంగా యాత్ర మధ్యలో అవసరమైతే వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునేందుకు వీలుగా పొందుపర్చనున్న అబార్ట్ వ్యవస్థను ఈ నెలాఖరులో మొదటిసారి పరీక్షించనున్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన వాహక వ్యవస్థలన్నీ ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్నాయని, వాటి కూర్పు ప్రక్రియ కొనసాగుతోందని నాయర్ పేర్కొన్నారు.