News

ప్రభుత్వ అధికార లాంఛనాలతో M.S.స్వామినాథన్​ అంత్యక్రియలు

157views

హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్​ స్వామినాథన్‌ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. చెన్నైలోని బీసెంట్​ నగర్​ శ్మశాన వాటికలో స్వామినాథన్​ పార్థివ దేహానికి ఆయనకు కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందుకు, శ్మశానవాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో పోలీసులు గౌరవవందనం సమర్పించారు.

స్వామినాథన్ పార్థివదేహానికి చెన్నైలోని తేనాంపేటలోని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు, ప్రజలు అభిమానులు నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రతిపక్ష నేత పళనిస్వామి తదితరులు స్వామినాథన్​కు నివాళులు అర్పించి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్​ చెన్నై గురువారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు.