News

7500 పూల కుండీలతో చంద్రయాన్‌-3 నమూనా

115views

తమిళనాడు నీలగిరి జిల్లాలోని ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో 7500 పూల కుండీలతో రూపొందించిన చంద్రయాన్‌-3 నమూనా పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో యేటా ఏప్రిల్‌ – మే, సెప్టెంబరు – అక్టోబరు నెలల్లో సీజన్‌ మొదలవుతుంది. ఈ సంవత్సరంలో రెండో సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. వందల రకాల పుష్పాలు గార్డెన్‌లో చోటు చేసుకున్నాయి. ఇక్కడ సుమారు 4 లక్షల అందమైన, ఆకర్షణీయమైన రంగురంగుల పుష్పాలు ప్రదర్శనకు ఉంచారు. దాదాపు 21,500 పూలకుండీల్లో పుష్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా 7500 పూల కుండీలతో రూపొందించిన చంద్రయాన్‌-3 నమూనా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంతోంది