News

రాజస్థాన్‌లో 34 నెలల్లో 444 గోవుల అక్రమ రవాణా

165views

రాజస్థాన్‌లో అక్టోబర్ 2020 నుంచి ఆగస్టు 2023 మధ్య జరిగిన ఆవుల అక్రమ రవాణా సంఘటనలపై జైపూర్ విశ్వ సంవాద్ కేంద్రం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను మేజర్ సురేంద్ర పూనియా, రిటైర్డ్ బిఎస్ఎఫ్ అధికారి మదన్ సింగ్ రాథోడ్ విడుదల చేశారు. ఈ 72 పేజీల నివేదికలో, 34 నెలల్లో జరిగిన 444 గోహత్య సంఘటనల వివరాలను పేర్కొన్నారు.నివేదికలో గోహత్యలకు సంబందించిన రిఫరెన్స్ మూలాలు, ఫోటోలు, వార్తల కటింగ్‌లు కూడా పొందుపరిచారు.

పశువుల స్మగ్లర్లు ఇళ్లలో, గోశాలల్లో పెంచుకునే గోవులపైనే టార్గెట్ చేస్తున్నారనే వాస్తవాలు బయటపెట్టేందుకు విశ్వ సంవాద్ కేంద్రం కృషి చేసింది.ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వాలు విధానాలను, పరిపాలనా వ్యూహాలను రూపొందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆవుల అక్రమ రవాణా పూర్తిగా చట్టవిరుద్ధ చర్య. ఇటువంటి సంఘటనలు ప్రజల విశ్వాసాన్ని, ఉపాధిని దెబ్బతీయడమే కాకుండా.. చట్టాన్ని, భద్రతా వ్యవస్థను ప్రశ్నించడంతో పాటు.. వ్యవస్థీకృత నేరాలను ప్రేరేపించేందుకు అవకాశాన్ని కల్పిస్తాయని తెలిపింది. కాబట్టి గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.