News

ఆసియా క్రీడల్లో భారత్ కు ఒక్కరోజే 8 పతకాలు

335views

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఒక్క రోజులోనే ఎనిమిది పతకాలను సాధించారు. ఇందులో షూటింగ్ విభాగంలో ఏడు పతకాలను సొంతం చేసుకోగా మరొకటి సెయిలింగ్‌లో వచ్చింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 22కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. షూటింగ్‌లో మూడు బంగారు పతకాలు, నాలుగు రజత పతకాలు, ఐదు కాంస్య పతకాలను భారత షూటర్లు కైవసం చేసుకున్నారు.