News

అన్నవరం దేవస్థానంలో లక్ష్మీ గణపతి హోమం

459views

అన్నవరం దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఉత్సవాల్లో చివరి రోజు వేద పండితుల ఆధ్వర్యంలో హోమం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అనంతరం నిమజ్జనం ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేశారు. సాయంత్రం భారీ ఊరేగింపుతో పంపా రిజర్వాయర్‌లో నిమజ్జనం చేయనున్నారు. ఉత్సవాల్లో భాగంగా గణనాథుడు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.