
215views
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సేవలందిస్తున్న వాహనం బేరర్లు, మేళం సిబ్బందికి శుక్రవారం తమిళనాడుకు చెందిన దాత శ్రీ తంగదొరై అనే భక్తుడు రూ.2 లక్షలు విలువైన 120 పంచెలను బహుమానంగా అందించారు.
ఉదయం పల్లకీ ఉత్సవం అనంతరం వైభవోత్సవ మండపంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి చేతులమీదుగా దాత ఈ పంచెలను అందజేశారు.





