News

‘చంద్రయాన్‌–3’ రీయాక్టివేట్‌కు ఇస్రో సన్నద్ధం

281views

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌–3 మిషన్‌లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవంలో దిగి సేవలందించిన ల్యాండర్, రోవర్‌లను రీయాక్టివేట్‌ చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడి సమాచారాన్ని అందించింది. అనంతరం దక్షిణ ధృవంలో సూర్యాస్తమయం అవడంతో.. ఇస్రో శాస్త్రవేత్తలు ఈనెల 2న రోవర్‌ను, 4న ల్యాండర్‌ను స్లీపింగ్‌ మోడ్‌లోకి పంపించారు.14 రోజుల తర్వాత రేపు (శుక్రవారం)మళ్లీ ఇప్పుడు ల్యాండర్, రోవర్‌లు ఉన్న శివశక్తి ప్రాంతంలో సూర్య కిరణాలు ప్రసరించనున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యోదయం తర్వాత సూర్యరశ్మిని ఉపయోగించుకొని.. ల్యాండర్, రోవర్‌లోని బ్యాటరీలు రీచార్జ్‌ అవు­తాయని భావిస్తున్నారు. రేపు ల్యాండర్, రోవర్‌ పనితీరును ఇస్రో పునరుద్ధరించే అవకాశముంది.