News

అగ్ని గుండంలో నడచిన బీజేపీ నేత సంబిత్ పాత్రా

223views

భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా (Sambit Patra) పురి జిల్లాలో ఝాము జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 10 మీటర్ల పొడవైన అగ్ని గుండంలో నడిచారు. డులన్ దేవి ఆశీర్వాదాలను పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

సంబిత్ పాత్రా మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, తాను ఒడిశాలోని పురి జిల్లా, సమంగ్ పంచాయతీ పరిధిలోని రేబతి రమణ్ గ్రామంలో జరిగిన జాతరలో పాల్గొన్నానని తెలిపారు. అగ్ని గుండంలో నడిచి, డులన్ దేవి మాతను ప్రార్థించానని తెలిపారు. ఆమె ఆశీర్వాదాలను పొందానని, గ్రామస్థులంతా సంతోషంగా, సౌభాగ్యవంతంగా ఉండాలని ప్రార్థించానని చెప్పారు. అగ్ని గుండంలో నడవడంతో దేవీతల్లి దీవెనలు తనకు లభించాయనే అనుభూతి కలిగిందని చెప్పారు. జక్, ఝాము యాత్రలో ఈ సంప్రదాయం కనిపిస్తుందని తెలిపారు. సంబిత్ పాత్రా విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, శాంతియుత జీవనం కోసం తాను అగ్ని గుండంలో నడిచానని తెలిపారు. ఆయన అగ్ని గుండంలో నడిచిన వీడియోను కూడా ఆయన జత చేశారు. సంబిత్ పాత్రా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పురి స్థానం నుంచి పోటీ చేసి, బీజేడీ (BJD) అభ్యర్థి పినాకి మిశ్రా (Pinaki Mishra) చేతిలో ఓడిపోయారు.