News

110 కిలోల బంగారం, వెండితో అంజన్న ప్రతిమ

182views

హనుమాన్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 54 అడుగుల ఎత్తైన హనుమాన్‌ విగ్రహాన్ని, బంగారం, వెండితో చేసిన మరో ప్రతిమను ఆవిష్కరించారు. బోటాడ్‌లోని సారంగ్‌పుర్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షా.. అనంతరం వాటిని ఆవిష్కరించారు. సూరత్‌కు చెందిన ఓ నిర్మాణ రంగ వ్యాపారి.. ఆరున్నర అడుగుల హనుమాన్‌ ప్రతిమను ఏర్పాటు చేశారు.

350 కిలోల బరువున్న ఈ విగ్రహానికి 110 కిలోల బంగారం, వెండి పూతను పూశారు. అయితే ఈ విగ్రహాన్ని దేవాలయంలో కాకుండా సొంత ఇంట్లోనే పెట్టి పూజ చేస్తామని ఆయన తెలిపారు. సారంగ్‌పుర్‌లోనే 54 అడుగుల ఎత్తైన హనుమాన్‌ విగ్రహాన్ని అమిత్‌ షా ఆవిష్కరించారు. తన కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాతో కలిసి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడినషా.. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం, హనుమాన్‌ జయంతి ఒకటే రోజు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.