
222views
చిత్తూరు జిల్లాలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఇకపై ప్రతి బుధవారం తిరుమంజన సేవ నిర్వహించనున్నట్లు ఈవో వెంకటేశులు తెలిపారు. ఆలయంలో ఈ సేవను బుధవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవ నిర్వహించనున్నట్లు ఈవో చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా అంత్రాలయ, గర్భాలయ గోడలతో పాటు ఆలయాన్ని పరిశుభ్రం చేసి, విచ్చేసే భక్తులకు భక్తిభావం కలుగచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఉభయదారులు, సిబ్బంది పాల్గొనవచ్చన్నారు. ప్రస్తుతం వారం వారం చేస్తూ, త్వరలో నెలలో ఒక్క రోజు ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.





