
331views
పాకిస్థాన్‌లో ఓ హిందూ వైద్యుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రముఖ చర్మవ్యాఽధి నిపుణుడు ధరమ్‌దేవ్ రాఠీని ఆయన డ్రైవర్ హనీఫ్ లెఘారీ కత్తితో గొంతు కోసి చంపేశాడు. హైదరాబాద్‌లోని రాఠీ సొంతింట్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. ‘ది నేషన్’, రాఠీ ఇంట్లో వంటమనిషి కథనం ప్రకారం.. ధరమ్, హనీఫ్ కారులో ఇంటికి వెళ్తుండగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కారు ఇంటికి చేరగానే హనీఫ్ వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకొని ధరమ్ కుత్తిక కోశాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం హనీఫ్ ధరమ్ కారులో అక్కడి నుంచి తన సొంతూరైన ఖైపూర్‌కు పరారయ్యాడు. హనీ్‌ఫను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




