News

లక్ష్మీనరసింహస్వామికి చక్రస్నానం

266views

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో 5వ రోజు దేవుని కోనేటి వద్ద శ్రీ చక్రపెరుమాళ్లకు చక్రతీర్ధం వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం సేవాకాలం అనంతరం లక్ష్మీనరసింహస్వామిని, శ్రీ భూ సమేత అనంత పద్మనాభస్వామిని, చక్రపెరుమాళ్లస్వామిని రెండు వేర్వేరు పల్లకిల్లో ఆశీనులను చేసి మంగళవాయిద్యాలు, వేద మంత్రాలు, భక్తుల గోవిందనామాల మధ్య పలకీలో దేవస్థానం నుంచి గిరి ప్రదక్షణ చేస్తూ దేవుని కోనేటి వద్దకు చేరుకున్నాయి. అక్కడ వేదపండితులు విశ్వక్షేన ఆరాధన, పుణ్యవ హచనం జరిపి చక్రపెరుమాళ్ళ స్థ్నపన తిరుమంజనం(పంచామృత అభిషేకం) నిర్వహించారు. కోనేటి వద్ద చక్రపెరుమాళ్లకు భక్తులు గోవిందనామాల మధ్య చక్రస్నానం జరిపించారు. అనంతరం రెండు పల్లకీలు తిరిగి దేవస్థానానికి చేరాయి. అనంతరం దిగువ దేవస్థానం వద్ద లక్ష్మీనరసింహస్వామిని, అనంత పద్మనాభస్వామిని, శ్రీచక్రపెరుమాళ్లను యథాస్థానంలో ఉంచి సేవాకాలం నిర్వహించారు.