News

జామి ఎల్లారమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

132views

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన జామి ఎల్లారమ్మ జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు. ఆదివారం రాత్రి జముకుల పాటతో అమ్మవారిని ఆవహించిన పూజారిని ఇంటి నుంచి ఆలయానికి తీసుకెళ్లడంతో జాతర ప్రారంభమవుతుంది. ముందుగా బ్రాహ్మణ వీధుల్లో అమ్మవారి కన్నవారింటికి, అత్తవారింటికి తీసుకెళ్లి పూజలు చేస్తారు. 27న పెద్ద తీర్థం, 28న చిన్న తీర్థం జరుగుతాయి. విజయనగరం, ఎస్‌.కోట, కొత్తవలస నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. జాతరకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని దేవదాయ శాఖ అంచనా వేస్తోంది. అటు పోలీస్‌ శాఖ కూడా ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపడుతోంది.