News

చార్‌ధామ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

189views

చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ పేర్లను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కాలంలో జోషీమఠ్‌లో భూమి కుంగుతున్న నేపథ్యంలో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస.సంధు అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. ప్రాంతీయ భాషల్లోనూ పత్రికా ప్రకటనలు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.