
252views
చైనాలో లింగ అసమతుల్యత రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా గ్రామీణ చైనాలో ఈ సమస్య అధికంగా ఉంది. సెంట్రల్ చైనా నార్మల్ యూనివర్సిటీ 2017లో దేశవ్యాప్తంగా 267 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో ప్రతి 100 మంది ఒంటరి పురుషులకుగానూ 63 మంది ఒంటరి మహిళలు మాత్రమే ఉన్నట్టు తేలింది. మహిళల సంఖ్య తగ్గిపోతుండడంతో పురుషులు అధిక కట్నాలు చెల్లించి మరీ పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. వ చైనా మీడియా నివేదికల ప్రకారం.. వధువుకు చెల్లించే కట్నం సగటున రూ.24 లక్షల (2లక్ష యువాన్లు)కు చేరవచ్చని అంచనా. ఇటీవల జియాంగ్జీలో ఒక కుటుంబం తమ కుమార్తెకు రూ.కోటి (8,80,000 యువాన్లు) అడగడం పెద్ద చర్చకు దారితీసింది.





