News

భారత్‌లో సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానాల తయారీ

203views

ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఆంక్షల బారి పడిన రష్యా.. తన సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ పౌర విమానాలను భారత్‌లో తయారు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)తో రష్యాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌(యూఏసీ) చర్చలు జరుపుతోంది. రష్యాలో సూపర్‌జెట్‌ను రష్యన్‌ విడి భాగాలతోనూ, విదేశీ భాగాలతో భారత్‌తో సుఖోయ్‌ సూపర్‌జెట్‌ ఇంటర్నేషనల్‌ను తయారు చేయాలన్నది తమ ప్రణాళిక అని యూఏసీ డైరెక్టర్‌ జనరల్‌ యూరీ బి.స్ల్యూసర్‌ తెలిపారు.