
266views
అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను భారత్ త్వరలో కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటంటే.. లేజర్ గైడెడ్ హెల్‌ఫైర్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంగా ప్రయోగించగలవు. అల్‌ఖైదా చీఫ్ ఐమాన్ అల్-జవహిరిని అంతం చేసేందుకు అమెరికా ఈ డ్రోన్‌నే వినియోగించిందని అంటారు. త్రివిధ దళాలు ఒక్కోదానికి పదేసి చొప్పున మొత్తం 30 రీపర్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అయితే.. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. కొనుగోలుపై గురువారం రక్షణ సముపార్జన మండలి(డీఏసీ) భేటీలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.