News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

178views

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 63,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.07 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. శ్రీవారికి 25,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నేడు ఆన్‌లైన్‌లో వర్చువల్ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకూ వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.