News

అత్యాచార కేసుల్లో భారత సంతతి న్యాయమూర్తి సంచలన తీర్పు.. నిందితుడికి 36 యావజ్జీవ కారాగార శిక్ష!

297views

అత్యాచారం కేసుల్లోని ఓ నిందితుడికి భారత సంతతి న్యాయమూర్తి పరమ్‌జిత్‌ కౌర్‌ బాబీ చీమా–గ్రప్‌ ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధించడం యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో సంచలనంగా మారింది. మెట్రోపాలిటన్‌ పోలీసు మాజీ అధికారి అయిన డేవిడ్‌ కారిక్‌(48) 2003 నుంచి 2020 దాకా.. 17 ఏళ్ల వ్యవధిలో దాదాపు 12 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిని దారుణంగా హింసించాడు. అతను మొత్తం 49 నేరాలకు పాల్పడినట్లు తేలింది. నేరాలన్నీ నిరూపితం కావడంతో.. లండన్‌లోని సౌత్‌వార్క్‌ క్రౌన్‌ కోర్టు న్యాయమూర్తి పరమ్‌జిత్‌ కౌర్‌ మంగళవారం తీర్పు ప్రకటించారు. దోషికి 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని, పెరోల్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 30 ఏళ్లు జైల్లో ఉండాల్సిందేనని ఆమె తేల్చిచెప్పారు.