News

సంఘటిత సమాజమే ధర్మాన్ని రక్షిస్తుంది – ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిలభారత కార్యకారిణి సదస్యులు భాగయ్య

736views

ధర్మాన్ని పరిరక్షించాలంటే… సంఘటిత సమాజం అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ అఖిలభారత కార్యకారిణి సదస్యులు మాననీయ భాగయ్య తెలిపారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో నిర్వహించిన మహా నగర సాంఘీక్ లో ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మమంటే త్యాగం, తపస్సు, కరుణ, ప్రేమ అని ఆయన తెలియజేశారు. సమాజంలో అన్నీ వృత్తులవారూ కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. ”సంఘటితంగా లేని సమయంలోనే మనమందరం పరాధీనులం అయ్యాం” అని భాగయ్యజీ వివరించారు. నగరాలు, గ్రామాలు ఎప్పుడైతే వ్యవస్థీకృతమవుతాయో అప్పుడే భారత దేశం గౌరవించబడుతుందన్నారు. ఈ మహానగర సాంఘీక్ లో విశాఖపట్నంతోపాటు చుట్టుపక్కన ఉన్న ప్రాంతాల నుంచి స్వయం సేవకులు పాల్గొన్నారు. సుమారు 136 బస్తీలు, 101 గ్రామ పంచాయతీల నుంచి 2500 మంది వరకు సంపూర్ణ గణవేష్ తో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.