News

చిన వెంకన్న దర్శనానికి కాలినడకన వెళ్తున్న వేలాది మంది భక్తులు

240views

ద్వారకా తిరుమలలోని చినవెంకన్న క్షేత్రానికి జంగారెడ్డిగూడెం నుంచి ఆరు వేల మంది వరకు పాదయాత్రగా తరలి వచ్చారు. ఏటా మాఘశుద్ద ఏకాదశి రోజున కాలినడకన క్షేత్రానికి కాలినడకన భక్తులు వస్తుంటారు. జంగారెడ్డిగూడెం పాతబస్టాండు వద్ద సాయిబాబా మందిరం నుంచి తెల్లవారుజామున యాత్ర ప్రారంభమైనట్టు తెలిపారు. మార్గంమధ్యలో వారికి పలువురు అల్పాహారాన్ని అందజేశారు.

వేడుకగా.. శ్రీవారి తిరువీధి సేవ..
భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తొళక్క వాహనంపై ఉభయదేవేరులతో కొలువుదీరిన శ్రీవారు బుధవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో భక్తజనులకు దర్శనభాగ్యాన్ని ఇచ్చారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తొళక్కంపై ఉంచి అలంకరించారు. అనంతరం మేళతాళాల నడుమ తిరువీధులకు తీసుకెళ్లారు. ప్రతీ ఇంటి ముందు దేవతామూర్తులకు హారతి పట్టారు.