News

సామాజిక మాధ్యమాలతో ప్రజల్లోకి ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల భావజాలం.. సహకరిస్తున్న వార్తా సంస్థలు, పాత్రికేయులు!

278views

ఖలిస్థాన్ అనుకూల సంస్థలు కొన్ని వార్తా సంస్థలు, కొందరు పాత్రికేయులతోనూ సంబంధాలు పెట్టుకున్నాయని పంజాబ్ పోలీస్ అధికారి తన నివేదికలో తెలియజేయడం సంచలనంగా మారింది. ఈ పీకేయీ సంస్థలు ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ప్రజలకు తమ భావజాలాన్ని చేరవేస్తున్నాయని తెలిపారు. ఈ నివేదికను ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ-బుక్‌ కోసం రాశారు.

పంజాబ్ ఐపీఎస్ అధికారి, ఎస్ఎస్‌పీ గుల్నీత్ సింగ్ ఖురానా ఓ నివేదికను తయారు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల దర్యాప్తును ప్రస్తుతం ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్‌కు సంబంధించిన కేసు దర్యాప్తును కూడా ఆయనే చేపడుతున్నారు. కొందరు పాత్రికేయులు, వార్తా సంస్థలు ప్రో ఖలిస్థానీ ఎంటీటీలకు సంబంధించినవారితో ఇంటర్వ్యూలు చేసి, తమ వ్యక్తిగత న్యూస్ ఛానల్స్‌లో ప్రసారం చేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు.

రాడికల్ ఐడియాలజీని ప్రచారం చేసే చాలా ఛానళ్లు భారత దేశంలో ఆన్‌లైన్‌లో వస్తున్నాయని, విదేశాల్లో ప్రసారమవుతున్నాయని తెలిపారు. మరణించిన ఉగ్రవాదుల కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలను, మాజీ ఉగ్రవాదుల ఇంటర్వ్యూలను వీరు ప్రసారం చేస్తున్నారన్నారు. స్పాన్సర్‌షిప్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్ ద్వారా వీరికి నిదులు సమకూరుతున్నాయన్నారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్ బలంగా ఉండటంతో దాని ద్వారా ఆయుధాలు, మందుగుండును అక్రమంగా రవాణా చేస్తున్నారని దాడులకు పాల్పడటం కోసం సిద్ధమవుతున్నారని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాదులు ఆన్‌లైన్ ప్రోపగాండా ఛానల్స్‌ను కూడా నడుపుతున్నారని తెలిపారు. వీటి ద్వారా వస్తున్న నిధులను ఉగ్రవాదానికి మళ్ళిస్తున్నారని పేర్కొన్నారు.