
18views
కర్ణాటకలో సంచలనం సృష్టించిన హిజాబ్ నిషేధం అంశాన్ని సుప్రీంకోర్టులో విచారించనున్నారు. హిజాబ్ వివాదాన్ని తేల్చేందుకు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సోమవారం హిజాబ్ అంశాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా ప్రస్తావించారు. ఫిబ్రవరి 6 నుంచి కర్ణాటకలో ప్రాక్టికల్ పరీక్షలు మొదలవుతున్నాయని.. ఇవి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరుగుతున్నాయని.. అక్కడ హిజాబ్ ధారణపై నిషేధం ఉందని.. అందుచేత మధ్యంతర ఉత్తర్వులు తక్షణావసరమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘ఇది త్రిసభ్య ధర్మాసనానికి సంబంధించిన అంశం. విచారణకు తేదీ కేటాయిస్తాం’ అని తెలిపారు.