News

రఘునాథస్వామి ఆలయ భూములను పరిరక్షించాలి

33views

రఘునాథస్వామి భూముల పరిరక్షణ కోరుతూ నూజివీడు మండలం గొల్లపల్లి రఘునాథస్వామి ఈవో కార్యాలయం వద్ద గ్రామస్థులు నిరసన దీక్ష చేపట్టారు. ఆలయానికి దాదాపు 3,600 ఎకరాల భూమిని జమిందారీలు కేటాయించారని, అయితే సంబంధిత భూములు అన్యాక్రాంతమవుతున్నాయంటూ గొల్లపల్లి గ్రామస్థులు దేవదాయశాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రఘునాథస్వామి దేవస్థానానికి ఇచ్చిన భూముల్లో కొంతభాగం సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా రైతులు కౌలు చెల్లిస్తున్నారని, అయితే ఆలయ భూములపై కన్నేసిన బడాబాబులు కొంతకాలంగా భూముల్లో కోళ్ళఫారాల షెడ్లు స్థాపించడంతోపాటు వాణిజ్య పంటలు సాగుచేస్తూ రికార్డులను తారుమారు చేస్తూ దేవుని ఆదాయానికి గండికొడుతున్నారని ఆరోపించారు.