అండమాన్ ద్వీపంలోని 21 దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పరాక్రమ్ దివస్ సందర్భంగా పరమవీర చక్ర విజేతల పేర్లు పెట్టారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగిస్తూ.. తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన భూమి ఇదే అని గుర్తు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీ నేషనల్ మెమోరియల్ నమూనాను కూడా ప్రారంభించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు జనవరి 23న పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటారు.
అండమాన్ , నికోబార్ దీవులలోని అతిపెద్ద ద్వీపానికి మొదటి పరమవీర చక్ర విజేత పేరు పెట్టారు. అదేవిధంగా ఇతర ద్వీపాలకు వాటి పరిమాణాన్ని బట్టి పేర్లు పెట్టారు. ఈ పేర్లు పరమవీర్ చక్ర విజేతలు, మేజర్ సోమనాథ్ శర్మ, నాయక్ జాదునాథ్ సింగ్, కంపెనీ హవల్దార్ మేజర్ పీరు సింగ్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే పేర్లను పెట్టారు.