News

పాక్‌లో దైవ దూషణ చట్టం మరింత కఠినం.. భారత్‌లో పరిస్థితి ఎలా ఉందంటే?

267views

దైవదూషణ చట్టాలను మరింత కఠినతరం చేస్తూ పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇస్లాంను, మహమ్మద్‌ ప్రవక్తను నిందిస్తే ప్రస్తుతం మరణశిక్ష విధించే అవకాశం ఉంది. ఇకపై ప్రవక్తతో సంబంధం ఉన్న వ్యక్తులను అవమానించినా కఠిన శిక్షలు పడనున్నాయి. ఈ మేరకు ఇటీవల ఓ చట్టాన్ని అక్కడి పార్లమెంటు ఆమోదించింది. మహమ్మద్‌ ప్రవక్త భార్యలను, దగ్గర బంధువులను విమర్శిస్తే పదేళ్ల పాటు ఇకపై జైలు శిక్ష విధించనున్నారు. దానిని జీవిత ఖైదుగా కూడా మార్చే అవకాశం ఉంది.

భారత్‌లో ఇలా..
భారత దేశంలో హిందూ మతాన్ని కించపరిచే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మన దేశంలో చట్టాలు, శిక్షలు సైతం బలహీనంగా ఉండటంతో ఇతర మతస్థులు రెచ్చిపోతున్నారు. భారత్‌లో మతాలను కించపరిస్తే.. కేవలం మూడేళ్ల జైలు శిక్ష, ఫైన్‌ విధిస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హేతువాదుల ముసుగులో అయ్యప్ప స్వామిని, సరస్వతీ దేవిని అవమానించిన సంఘటనలు అందరికీ విధితమే. ఈక్రమంలో భారత్‌లో చట్టాలు మరింత బలంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.