News

తీవ్రవాదుల ఆర్ధిక మూలాలపై ఈ’ఢీ’

883views

తీవ్రవాదుల ఆర్ధిక మూలాలను నిలుపుదల చేసే చర్యల్లో భాగంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) కాశ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వటాలి కి చెందిన 6.19 కోట్ల ఆస్తిని జప్తు చేసింది. లష్కరే తోయిబా  చీఫ్ హఫిజ్ సయీద్ వంటి తీవ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (PMLA) క్రింద షాపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఛార్జ్ షీట్ దాఖలు చేసి దర్యాప్తు చేస్తోంది.

NIA అదుపులో వ్యాపారవేత్త షా.

హురియత్ కాన్ఫరెన్సు మరికొన్ని ఇతర సంస్థలు కూడా పత్రికా సమావేశాలు, సోషల్ మీడియా సాయంతో యువకులను రెచ్చగొట్టి కాశ్మీర్ లోయలో సమ్మెలు, సాయుధ దళాలపై రాళ్ళ దాడులు వంటి భారత వ్యతిరేక చర్యలకు స్థానిక యువతను పురిగొల్పుతున్నట్లుగా విచారణలో తెలియవచ్చింది.

ED కూడా NIA దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA ,1967) ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్దపడుతున్నారు.