News

ఇంద్రకీలాద్రిపై మరో అపచారం.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అర్చకుడి ప్రవర్తన.. ఏం చేశాడంటే?

143views

ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై మ‌రో అప‌చారం జరిగింది. బలిహారణ పీఠంపై ఎంగిలి నీళ్లు పోసిన అర్చక స్వామికి రూ. 10వేల అపరాధ రుసుము.. మరో ఇద్దరికి రూ. 5వేల చొప్పున ఆలయ ఈవో భ్ర‌మ‌రాంభ జరిమానా విధించారు. అపరాధ రుసుము కట్టిన తర్వాతే విధుల్లోకి రావాలని అర్చక స్వామి గణేష్‌కు సూచించారు. దీంతో ఆయన రూ. 10వేల అపరాధ రుసుము కట్టి విధులకు వచ్చారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇద్దరినీ మరోసారి కొండపైకి రావద్దని ఈవో హెచ్చరించారు.

పూర్తి వివరాలు ఇలా..
ఇటీవ‌ల ఓ మ‌హిళా భ‌క్తురాలు కొండ‌పైకి ద‌ర్శ‌నానికి వ‌చ్చి గ‌ర్భ‌గుడిలోని అమ్మ‌వారి మూల‌విరాట్‌ను సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసిన ఘ‌ట‌న మరువ‌క‌ముందే మ‌రో అప‌చారం జరిగింది. ఇంద్ర‌కీలాద్రిపై న‌ట‌రాజ స్వామి ఆల‌యం వెనుక ఉన్న సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి ఆల‌యంలోని బ‌లిహార‌ణ పీఠంపై అన‌ధికార అర్చ‌కులు ఎంగిలి నీళ్లు పోశారు. దీన్ని గ‌మ‌నించి ప్ర‌శ్నించిన భ‌క్తులపై దురుసుగా మాట్లాడుతూ అది త‌ప్పు కాదంటూ బుకాయించారు. దీంతో వారు ఈవో భ్ర‌మ‌రాంభకు ఫిర్యాదు చేశారు. ఇద్ద‌రినీ పిలిపించి విచార‌ణ చేయ‌గా వారు అస‌లు ఆల‌యానికి సంబంధం లేని వ్య‌క్తులుగా ఈవో గుర్తించారు.