News

లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులకు అనుమతి

289views

కన్యాకుమారి లైట్‌హౌస్‌(Lighthouse) పైకి శుక్రవారం నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. ఇటీవల లైట్‌ హౌస్‌ పైకి వెళ్లేలా రూ.1.85 కోట్ల వ్యయంతో అద్దాలతో కూడిన లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. పనులు ముగియడంతో లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 5.30 గంటలు, శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అనుమతించనున్నామన్నారు. పెద్దలకు రూ.10, చిన్నారులకు రూ.5, కెమెరా తీసుకెళ్లేందుకు రూ.20 రుసుముగా నిర్ణయించినట్లు అధికారులు తెలియజేశారు.