News

భద్రతా వలయాన్ని దాటుకుని ప్రధాని మోదీకి దండ వేయబోయిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే?

271views

ప్రధాని మోదీ ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని హుబ్లీలో భారీగా ర్యాలీ నిర్వహించారు. కారులో నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిపోతుండగా.. ఆ సమయంలోనే అనుకోని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంత సెక్యూరిటీని దాటుకుని ఓ యువకుడు మోదీ కాన్వాయ్ వద్దకు పూల దండ తీసుకుని వచ్చాడు. వెంటనే ఎస్‌పీజీ సిబ్బంది గుర్తించి అతడిని పక్కకు తప్పించారు. ప్రధానికి పూల మాల ఇచ్చేందుకు ఆ యువకుడు వచ్చాడు. అయితే…అంత కట్టుదిట్టమైన భద్రతనూ దాటుకుని ఎలా రాగలిగాడన్నది ఆందోళనకరంగా మారింది. కర్ణాటకలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటోంది బీజేపీ. మిషన్ కర్ణాటకపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. మరోసారి కచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి రావాలని బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే…స్వయంగా ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్నారు.