News

తెలంగాణలో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు కీలక నేత మృతి!

252views

తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో మావోయిస్టు నేత హిడ్మా (Hidma)మృతి చెందారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లో (Telangana Border) ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎప్ కోబ్రా ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం. 40ఏళ్ల లోపు వయసుండే హిడ్మాకు మావోయిస్టుల్లో మాస్టర్ మైండ్‌గా గుర్తింపు ఉంది. 17 ఏళ్లకే మావోయిస్టుల్లో చేరిన హిడ్మా.. కొద్దికాలానికే కేంద్ర కమిటీ స్థాయికి చేరుకున్నట్టు చెబుతారు. బస్తర్ ప్రాంతంలోని మురియా గిరిజన వర్గానికి చెందిన మద్వి హిడ్మాను అనే 38 ఏళ్ల వ్యక్తి నక్సల్స్ నాయకుడు. అతడ ఫిలిప్పీన్స్‌లో గెరిల్లా వార్‌ఫేర్‌లో శిక్షణ పొందినట్లు సమాచారం. హిడ్మాను ఇంగ్లీష్‌తోపాటు గిరిజన మాండలికాలు, దేశంలోని అనేక ప్రాంతీయ భాషలలో నిష్ణాతుడని అంటుంటారు.

అతడిని హిడ్మాలు, సంతోష్ అని కూడా పిలుస్తారు. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా బెటాలియన్ నంబర్ వన్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో 180-250 మంది మావోయిస్టు ఫైటర్స్ ఉంటారు. 21 మంది సభ్యులున్న మావోయిస్టు కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు కూడా హిడ్మానే.

హిద్మా బృందాలు చేసిన అనేక ప్రాణాంతక దాడులలో మే 2013లో కాంగ్రెస్ కాన్వాయ్‌పై జీరామ్ వ్యాలీ ఆకస్మిక దాడి కూడా ఉంది. ఇందులో చాలా మంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, వీసీ శుక్లా వంటి నాయకులు సహా దాదాపు 32 మంది మరణించారు. హిడ్మాపై రూ.40 లక్షల రివార్డు కూడా ఉంది.