News

ఇజ్రాయెల్ ప్రధానికి ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డు!

259views

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌కు ఎంపికచేసింది. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు స్నేహితురాలు, భారతీయ మూలాలున్న మహిళా పారిశ్రామికవేత్త రీనా వినోద్‌ పుష్కామాతోపాటు మరికొందరిని ఈ అవార్డ్‌కు ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ నెల 8 నుంచి జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌ వేడుకల్లో వీరికి అవార్డులను ప్రదానం చేస్తారు. సంగీత విభావరి నిర్వాహకులు జుబెన్‌ మెహతా, నటి సోఫియా లోరెన్, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఐజాక్‌ రాబిన్, మాజీ అధ్యక్షుడు, ప్రధాని షిమోన్‌ పెరీస్‌సహా ఈ ఏడాది 21 మందిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు.