News

తీవ్రవాద దాడిలో ఆరెస్సెస్ కార్యకర్త దారుణ హత్య.

837views

తీవ్రవాద దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జమ్మూ కాశ్మీర్ ఆరెస్సెస్ నేత చంద్రకాంత్ శర్మ ఈ సాయంత్రం మృతి చెందారు.
జమ్మూ కాశ్మీర్లోని కిస్త్వార్ జిల్లా ఆసుపత్రిలో సహాయ వైద్యాధికారిగా పనిచేసే చంద్రకాంత్ శర్మ ఆరెస్సెస్ జమ్మూ కాశ్మీర్ ప్రాంత సహా సేవా ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న తీవ్రవాద ఏరివేత చర్యల్లో ప్రభుత్వానికి శ్రీ శర్మచురుగ్గా సహకరిస్తున్నారు. ఆ కారణంగానే తీవ్రవాదులు ఆయనమీద దాడి చేశారు.
ఈ ఉదయం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలోకి చొచ్చుకు వచ్చిన ఒక సాయుధ తీవ్రవాది తమ విధులలో వున్న శ్రీ చంద్రకాంత్, ఆయన వ్యక్తిగత భద్రతాధికారి రాజెంద్రకుమార్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో రాజేంద్ర కుమార్ ఆక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రకాంత్ శర్మ కూడా ఈ సాయంత్రం మృతి చెందారు.
ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొని వుంది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కిస్త్వార్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు.
గత సంవత్సరం నవంబర్లో BJP రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్ పరిహార్లు కూడా ఇదే విధమైన తీవ్రవాద దాడికి బలయిన విషయం పాఠకులకు విదితమే.