News

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై అమ్మవారు

28views

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ వేడుకల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై.. శ్రీ రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో.. కోలాటాలు, నృత్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు.. హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి