News

మైసూరు దసరా కార్యక్రమంలో పాల్గొనే ఏనుగు మృతి!

209views

మైసూరు: మైసూరులో జరిగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దసరా కార్యక్రమంలో పాల్గొనే గోపాలస్వామి అనే ఏనుగు మృతి చెందింది. అడవి ఏనుగుల దాడితో అది ప్రాణాలు కోల్పోయింది. నాగరహోళే నేషనల్ పార్క్ సమీపంలోని కొలువిగె అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది. ఈ ఏనుగును మంగళవారం నేరాలకుప్పె బి రివర్ క్యాంపు నుంచి ఆహారం కోసం అడవిలోకి విడుదల చేశారు అధికారులు. దీంతో అక్కడి అడవి ఏనుగులు దానిపై దాడి చేశాయి.

అడవి నుంచి ఏనుగు శబ్దం వినిపించగా.. స్థానికులు వెళ్ళి చూశారు. అప్పటికే ఏనుగు తీవ్ర రక్తస్రావంతో పడి ఉంది. దాన్ని గమనించిన స్థానికులు వైద్యులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి నలుగురు వైద్యుల బృందం అన్ని రకాల చికిత్సలు అందించారు. అయితే, చికిత్స ఫలించక బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మృతి చెందింది. డీసీఎఫ్ హర్షకుమార్ చిక్కనరగుండ, ఏసీఎఫ్ దయానంద్ సహా అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బుధవారం సాయంత్రం కొలువిగె దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి